క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశి కొత్త ప్రాజెక్ట్స్..?









 క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ తాజాగా మరో రెండు చిత్రాలను కమిటయ్యారు.మిరపకాయ చిత్రం నిర్మించిన పుప్పాల రమేష్ నిర్మాతగా ఓ చిత్రం,వైవియస్ చౌదరి నిర్మాతగా మరో చిత్రాలకి ఆయన సైన్ చేసారు.ఈ రెండు చిత్రాలు దాదాపు ఒకేసారి షూటింగ్ జరుపుకుంటాయి.త్వరలోనే ఈ చిత్రాలకు చెందిన వివరాలు రానున్నాయి. ఇక కృష్ణవంశీ తాజా చిత్రం మొగుడు ఈ నెల నాలగవ తేదీన విడుదల కానుంది. గోపీచంద్, తాప్సీ కాంబినేషన్ లో రూపొందిన మొగుడు చిత్రం ఇప్పటికే మార్కెట్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన తాప్సీ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రద్దదాస్ రెండో హీరోయిన్ పాత్ర చేస్తోంది. 


నల్లమలుపు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నరేష్, రోజా అతిథి పాత్రలో కనిపించనుండగా, డాక్టర్ రాజేంద్రప్రసాద్ ముఖ్యమైన పాత్రను పోషించారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 21న సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీకాంత్, సమర్పణ: బేబీ భవ్య, నిర్మాణ సంస్థ: లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్.


Comments

Popular posts from this blog

Krishnadevaraya caste confirmation

Kamma vari sur names with their location

Famous KAMMA personalities in all the fields